ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు ఇవాళ ప్రధాని మోదీ వెళ్లారు. శ్రీరామ జన్మభూమి వద్ద రామాలయ నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే భారతీయ వేషధారణలో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోకప్రియుడు, ఆదర్శవంతుడు రాముడి జన్మించిన అయోధ్యకు వెళ్లేందుకు మోదీ ధోతి కుర్తాను ధరించారు. సిల్వర్ కలర్ ధోతి, కాషాయరంగు కుర్తాలో మోదీ.. భారతీయ పురాతన వస్త్ర అలంకరణలలో మెరిశారు. అయోధ్యలోని హనుమాన్‌ఘడికి వెళ్లిన మోదీకి పూజారులు ఆయన తలపై ముకుటం ధరించారు. మర్యాదపురుషోత్తముడు శ్రీరాముడి అనన్యభక్తుడైన హనుమంతుడి ఆలయాన్ని దర్శించిన తర్వాతనే రామ్‌లల్లా వద్దకు వెళ్తారు. మోదీ కూడా తొలుత హనుమాన్‌ఘడి వెళ్లిన తర్వాతనే రామజన్మభూమి వద్దకు వెళ్లారు.
