అయోధ్య భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరున్న 9 ఇటుకల వినియోగం

అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరుగుతున్న భూమిపూజలో ‘జై శ్రీరామ్‌’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని పంపినట్లు వారు చెప్పారు. 1989లో రామ మందిరం నిర్మాణం కోసం సుమారు 2.75 లక్షల ఇటుకలను రామ భక్తులు అయోధ్యకు పంపినట్లు వివరించారు. ఇందులో ‘జై శ్రీరామ్‌’ పేరు ఉన్న వంద ఇటుకలను భూమిపూజ, అనంతర నిర్మాణ పనుల కోసం వినియోగిస్తారని పూజారులు పేర్కొన్నారు.