గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఛైర్మన్

టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జాప్ర‌తినిధులు, కార్పొరేట్ దిగ్గ‌జాలు, సీని ప్ర‌ముఖులు, క్రీడాకారులు, సామాజిక ఉద్య‌మ‌కారులు చురుకుగా పాల్గొంటున్నారు. 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శ్రీనివాస హ్యచరీస్ ఎండీ, ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఛైర్మన్ సురేష్ ఆర్ చిట్టూరి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. మహాలక్ష్మీ గ్రూప్ ఛైర్మన్ , యార్లగడ్డ హరిశ్చంద్ర‌ ప్రసాద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని సురేష్‌ తెలిపారు.

ఇంత‌ మంచి కార్యక్రమములో తనను భాగస్వామిని చేసిన హరిశ్చంద్ర‌ ప్రసాద్‌కు, ఇంతటి పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్న  జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఆయ‌న‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో, దీనిని ముందుకు తీసుకుపోయేందుకు, తన వంతుగా మరో ముగ్గురిని మూడు మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసిరారు. వారిలో పామ్ ఎక్సోటికా ఛైర్మన్ సందీప్ , పారిశ్రామిక వేత్తలు అమీన్ , పర్వేజ్ లు ఉన్నారు.