గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన నటుడు సుశాంత్‌రెడ్డి

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు సాయి సుశాంత్‌రెడ్డి మొక్కలు నాటారు. అభినవ్ గోమటం విసిరిన స్వీకరించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గురువారం మూడు మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట మంచి కార్యక్రమాన్ని చేపట్టి, ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. దీంట్లో భాగంగా తాను మిత్రుడు అభినవ్ గోమటం ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. అలాగే ఆయన ప్రముఖ సింగర్‌ మనీషా ఎర్రబత్తిని, చాందిని చౌదరి, వెంకటేశ్‌ కాకమనులకు తలో మూడు మూడు మొక్కలను నాటాలని కోరారు. ప్రతి ఒక్కరూ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములై మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణకు తమవంతు పాత్ర పోషించాలన్నారు.