గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్. రాజ్య సభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కొత్తగూడెం కలెక్టర్ రాజత్ కుమార్ శైని విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ , జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం మన అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని కోరారు. అందువల్ల భావితరాలకు మనం మంచి ఆక్సిజన్ అందించిన వారిమౌతాం అని అన్నారు.