ఆంధ్రప్రదేశ్ లో 12మంది సబ్ కలెక్టర్లను నియమించింది అక్కడి సర్కారు. 2018 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.12 మందిని సబ్ కలెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. చిత్తూరు డీఆర్డీఏ పీవోగా ఎంఎస్ మురళి నియమితులయ్యారు. అలాగే ప్రస్తుతం రాజంపేట, నరసరావుపేట, కందుకూరు, నూజివీడు, నంద్యాల, టెక్కలి, నర్సీపట్నంలో కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్లను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
నారపురెడ్డి మౌర్య – సబ్ కలెక్టర్ నర్సీపట్నం (విశాఖపట్నం)
శ్రీవాస్ అజయ్ కుమార్ – సబ్ కలెక్టర్ నరసరావుపేట (గుంటూరు)
అనుపమ అంజలి – సబ్ కలెక్టర్ రాజమహేంద్రవరం
పృధ్వీ తేజ్ ఇమ్మడి – సబ్ కలెక్టర్ కడప (కడప)
ప్రతిష్ఠ మాంగైన్ – సబ్ కలెక్టర్ నూజివీడు (కృష్ణ)
హిమాన్షూ కౌశిక్ – సబ్ కలెక్టర్ అమలాపురం (తూర్పు గోదావరి)
అమిలినేని భార్గవ్ తేజ – సబ్ కలెక్టర్ కందుకూరు (ప్రకాశం)
విధే ఖారే – సబ్ కలెక్టర్ పార్వతీపురం (విజయనగరం) ( పార్వతీపురం ఐటిడిఎ పిఓ గా అదనపు బాధ్యతలు)