సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప‌రామ‌ర్శ‌

దుబ్బాక ఎమ్మెల్యే  సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. చిట్టాపూర్‌లో రామలింగారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు. జర్నలిస్ట్ గా, ఎమ్మెల్యేగా  రామలింగారెడ్డి.. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు.