ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా తాజాగా 97 మంది చనిపోయారు. ఏపీలో ఇప్పటివరకు 2,17,040 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,29,615 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 85,486. ఏపీలో కరోనాతో ఇప్పటివరకు 1,939 మంది మృతిచెందారు.
జిల్లాల వారీగా కరోనా మరణాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరులో 14 మంది చనిపోగా అనంతపురం-11, కర్నూల్-10, పశ్చిమ గోదావరి-10, చిత్తూరు-8, నెల్లూరు-8, ప్రకాశం-7, శ్రీకాకుళం-7, తూర్పుగోదావరి-6, విశాఖపట్నం-5, విజయనగరం-5, కృష్ణ-4, కడపలో ఇద్దరు చొప్పున మృతిచెందారు.