విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోవిడ్‌కేర్ సెంటర్‌గా ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో 50 మంది కరోనా పేషెంట్లకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే హోటల్ సిబ్బంది అలర్ట్ కావడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు విస్తృతంగా వ్యాపించాయి. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
