విజయవాడ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతి

  • మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా

కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. కాగా.. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. ప్రమాద ఘటనపై కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్పాట్‌లో ఏడుగురు మృత్యువాత పడగా, ఆస్పత్రిలో ఇద్దరు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. రమేష్ హాస్పిటల్‌కి చెందిన కోవిడ్ కేర్ సెంటర్‌ను స్వర్ణపాలెస్‌లో నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. కాగా.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలసమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.