అగ్నిప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు : హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నాని

అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై వారిద్దరూ ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ…‘జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం రెండు కమిటీలు నియమించింది. ఒక కమిటీ హోంశాఖ , మరొక కమిటీ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. రెండు కమిటీలు 48 గంటల్లో నివేదిక ఇస్తాయి. 

నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.  విజయవాడలో 15 ప్రయివేట్‌ కోవిడ్‌ సెంటర్లు ఉన్నాయి, వాటన్నింటినీ తనిఖీ చేస్తాం. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రాథమికంగా ఆస్పత్రి వైఫ్యలం ఉన్నట్లు గుర్తించాం.