బోడుప్పల్ నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులను సోమవారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఎన్నుకున్నారు. పట్టణ పరిధిలోని బొమ్మక్ బాలయ్య ఫంక్షన్‌హాల్‌లో మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్ ఎన్.శంకర్ సమక్షంలో సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. బుర్ర దత్తాత్రేయశాస్త్రి, బద్దుల సుగుణ, రంగ బ్రహ్మన్నగౌడ్, నజియా బేగం, అడ్వా ర్డ్ జ్ఞానదేవ్ ప్రభాకర్‌ను ఎన్నుకున్నారు. ఈ మేరకు మేయర్ నియామక పత్రాలు అందజేశారు. ఐదు స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. డిప్యూ టీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడలో టీఆర్‌ఎస్ కైవసం
పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఐదు కో-ఆప్షన్ స్థానాలను కైవసం చేసుకున్నది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయలో మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అధ్యక్షతన కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. బొడిగ రాందాస్‌గౌడ్, చిలుముల జగదీశ్వర్ రెడ్డి, చెరుకు వరలక్ష్మి, ఫేక్ ఇర్ఫాన్, మహ్మద్ నాజియాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులకు మేయర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.