442 మంది జర్నలిస్టులకు ఆర్థికసాయం : మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ

కరోనా బారినపడిన 442మంది జర్నలిస్టులకు రూ.80లక్షల ఆర్థికసాయం అందజేసినట్టు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 257 మందికి రూ.20 వేల చొప్పున రూ.51.40 లక్షలు, హోం క్వారంటైన్‌లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు రూ.10వేల చొప్పున రూ. 8.10 లక్షలు అందించామని  పేర్కొన్నారు.