ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి బంజరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ చేశారు. బూర్గంపాడు ఎంపీపీ కైపు రొసిరెడ్డికి, ఇరవెండి ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణకి, బూర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డికి గ్రీన్ చాలెంజ్ విసిరారు వీరు కూడా మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ చేయాలని అన్నారు.బూర్గంపాడు మండలంలోని టిఆర్ఎస్ యువజన నాయకులను రోజు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి మిగతా యువకులకు చాలెంజ్ విసిరి ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం ఎంతో విజయవంతమైందని ప్రతి పల్లెలో ప్రతి వాడలో పచ్చదనం వస్తుందని గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇంకా పచ్చదనం చిగురిస్తోందని ఆయన అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ విసిరిన రేగా కాంతారావుకి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కైపు రొసిరెడ్డి,స్థానిక సర్పంచ్ భూక్య దివ్యశ్రీ,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బట్ట విజయ్ గాంధీ,ఎంపీటీసీలు చింతా కొటేశ్వరి, యెన్నం వెంకటేశ్వర్లు,మండల నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి, ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, స్థానిక నాయకులు మెడగం లక్ష్మీనారాయణ రెడ్డి, వార్డుమెంబెర్స్,స్కూల్ యాజమాన్యం, గ్రామస్తులు మరియు మరికొందరు మండల నాయకులు పాల్గొన్నారు.