తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,897 పాజిటివ్‌ కేసులు

 గడిచిన 24గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 84,544కి చేరాయి. వైరస్‌ ప్రభావంతో మరో 9 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 654కి చేరింది. ప్రస్తుతం 22,596 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తాజా మరో 1920 మంది కోలుకోగా, 61,294 మంది డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో రికవరీ రేటు 72.49 శాతంగా ఉందని, ఇది దేశ సగటుకు కంటే ఎక్కువ అని పేర్కొంది. అలాగే మరణాల రేటు 0.77 శాతంగా ఉందని వివరించింది. తాజాగా నిర్ధారణ అయిన కేసు అత్యధిక కేసులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 479 కేసులు ఉండగా, రంగారెడ్డిలో 162, సంగారెడ్డిలో 107 కేసులు అత్యధికంగా నిర్ధారణ అయ్యాయి.