పుడమితల్లి పచ్చదనంతో పరిఢవిల్లాలనే సంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో సినీ ప్రముఖులంతా భాగస్వాములవుతున్నారు. తాజాగా హీరో నవదీప్.. అలీ రాజా ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం తలపెట్టిన సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యజ్ఞంలో మీరు భాగస్వాములు కావాలని, చైన్‌ని ఇలానే కొనసాగించాలని నవదీప్ తన అభిమానులని కోరారు.
