‘మేడ్చల్, ఆదిలాబాద్ జిల్లాల ఇంచార్జీలుగా వినోద్ కుమార్, కర్నె ప్రభాకర్’

పంద్రాగస్టు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించే జిల్లా ఇంచార్జీలలో  స్వల్ప మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరిగే పంద్రాగస్టు వేడుకల ఇంచార్జీగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీగా రాష్ట్ర ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ లను ప్రభుత్వం నియమించింది.