విషమంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌ కేర్‌ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై శుక్రవారం సాయంత్రం వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కరోనా లక్షణాలతో ఆయన ఈ నెల 5న ఆస్పత్రిలో చేరారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి నుంచి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్న బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. నిన్న రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.