జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ప్రగతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. కేవలం ముఖ్యనాయకులు, కొద్దిమంది అధికారుల సమక్షంలోనే ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్ళి అమరులకు నివాళర్పించారు. దీనిలో భాగంగా దేశానికి సేవ చేసిన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఆవిర్భావం దగ్గర్నుంచీ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈసారి వేడుకల వేదికను ప్రగతి భవన్‌కు మార్చారు.