రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో నాగ శౌర్య ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన డైరెక్టర్ నందినీ రెడ్డి. ఈ సందర్భంగా నందినీ గారు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌గారు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పచ్చదనం పెంచడం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నారని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం. అలాంటి దానిలో నన్ను కూడా భాగం చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నందినీ రెడ్డి మరో ముగ్గురినీ నామినేట్ చేశారు. హీరో చైతన్య అక్కినేని, సింగర్ మిక్కీ జే మేయర్, లావణ్య త్రిపాఠిలను మొక్కలు నాటాలని కోరారు. ఈ పద్ధతి ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ఎంపీ సంతోష్‌గారికి మరోసారి కృతజ్ఙతలు చెప్పుకొచ్చారు.