తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటలవరకు కొత్తగా 1930 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1102 కరోనా కేసులునమోదవగా, తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసులు 91,361కుచేరగా, 693 మంది కరోనా వల్ల చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 22,542 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 68,126 మంది బాధితులు కోలుకున్నారు.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 234 కేసులు, కరీంనగర్ జిల్లాలో 101, రంగారెడ్డి 81, మేడ్చల్ మల్కాజిగిరి 63, సంగారెడ్డిలో 66 చొప్పున కేసులు ఉన్నాయి.