ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఈశ్వరమ్మ (84) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచారు. ఈశ్వరమ్మకు మొత్తం 11 మంది పిల్లలు. వీరిలో ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కొడుకు. రెండో కుమారుడు అప్పల నరసయ్య ప్రస్తుతం ఎంఎల్ఎగా ఉన్నారు. విజయనగరంలో ఆదివారం మధ్యాహ్నం ఈశ్వరమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పలువురు ప్రముఖులు ఆమె మృతిపై సంతాపం ప్రకటించారు.
