రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, మేధావులు పాల్గొని మొక్కలను నాటుతున్నారు. నాగర్‌కర్నూల్ టీఆర్ఎస్ ఎంపీ రాములు తన జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన కుమారుడు, మనువళ్లతో కలిసి రాములు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ఎంపీ రాములుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సంతోష్ కుమార్. ఎంపీ రాములుకు సంతోష్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
