కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒమేగా దవాఖానలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా రెండు సార్లు పని చేశారు. 1994-99 లో ఇండిపెండెంట్ గా గెలుపొంది ఎమ్మెల్యేగా సేవలందించారు. రెండోసారి 2004-09 కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. కిష్టా రెడ్డి మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.
