తమ భూమిపై కన్నేసిన కీసర తాసిల్దార్ నాగరాజు, రియల్ వ్యాపారులు కందాడి అంజిరెడ్డి, శ్రీనాథ్‌పై తగు చర్యలు తీసుకోవాలని వేల్పుల కుటుంబం ఏసీబీకి వినతిపత్రం అందించింది. మండల పరిధిలోని రాంపల్లిదాయరలోని 54 ఎకరాల్లో తమ కుటుంబానికి చెందిన వ్యక్తులు వ్యవసాయం చేస్తున్నారని.. 33 ఎకరాల 4 గుంటల భూమికి సంబంధించి 1995లో పాస్ పుస్తకాల కోసం ఆర్డీవోను సంప్రదించగా 16 ఎకరాల 21 గుంటలకు ఓఆర్సీ (నం.జే.5798బై1996) ఇచ్చారని బాధితులు చెప్పారు. మిగతా భూమి పెండింగ్‌లో ఉండటంతో.. అంజిరెడ్డి, శ్రీనాథ్ ఇతరులతో కలిసి నాగరాజుతో భారీ కమిట్మెంట్ కుదుర్చుకున్నారని ఆరోపించారు.
