తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

తెలంగాణలో గడిచిన కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉత్తర బంగాళాఖాతంలో అప్పపీడనం తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాగల 24గంటల్లో అప్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై తీవ్ర అప్పపీడన ప్రభావం పడనుంది. ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 23న వాయవ్య బంగాళాఖాతంలో మరో అప్పపీడనం ఏర్పడే అవకాశముందన్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.