కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. వైరస్ పంజా విసరడంతో వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. నిన్న 64 వేలకుపైగా కరోనా కేసులు నమోదవగా, ఈ రోజు 69 వేలకుపైగా మందికి కరోనా వైరస్ సోకగా, ఒక్కరోజులో 60 వేల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో 28 లక్షల మార్కును దాటాయి.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 69,652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు ఇంత పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాటివ్ కేసుల్లో 20,96,665 మంది బాధితులు కోలుకోగా, 6,86,395 మంది దవాఖానల్లో చికిత్సపొందుతున్నారు. అదేవిధంగా నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు కరోనా వల్ల 977 మంది కొత్తగా మరణించారు. దీంతో కరోనాతో మరణించిన బాధితులు 53,866కు పెరిగారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.