గరిడేపల్లి/మఠంపల్లి మఠంపల్లి మండలంలోని పెదవీడు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 540లో గల 421 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమిని పొజిషన్‌లో లేని కొందరు వ్యక్తులు, సంస్థలకు అక్రమంగా మ్యుటేషన్ చేశారంటూ గరిడేపల్లి, మఠంపల్లి టి.వేణుగోపాల్‌రావులపై సస్పెన్షన్ వేటు వేస్త్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు గరిడేపల్లి తాసిల్దార్‌గా కొనసాగుతున్న జి.చంద్రశేఖర్ గతంలో మఠంపల్లి తాసిల్దార్‌గా విధులు నిర్వహించారు.
ఆ సమయంలో పెదవీడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 540లో ఎన్‌వీఆర్ బయోటెక్ పేరుపై గల 233 ఎకరాల 10 గుంటల భూమిని 2018 ఆగస్టు 23న గ్లేడ్ ఆగ్రో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మ్యానువల్ పద్ధతిలో మ్యుటేషన్ చేశారు. అలాగే ఎకరాల 15 గుంటల భూమిని గ్లేడ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్‌కు, 48 ఎకరాల 20 గుంటల భూమిని గ్లేడ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పేరున వెబ్‌ల్యాండ్ నడుస్తున్నప్పటికీ పద్ధతిలో మ్యుటేషన్ చేశారని రుజువు కావడంతో చేశారు.ప్రస్తుతం మఠంపల్లి తాసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌రావు పెదవీడులోని 540 సర్వే నెంబర్‌లో పొజీషన్‌లో లేని ఆరుగురికి ఎకరాల ప్రభుత్వ భూమిని మ్యుటేషన్
పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇద్దరు తాసిల్దార్లను ఒకేసారి సస్పెండ్ చేయడంతో రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే.. మండలంలో వీరిపై మరిన్ని అభియోగాలు వస్తున్నట్లు తెలుస్తుంది. పెదవీడు రెవెన్యూ గ్రామ పరిధిలోని 540 సర్వే నెంబర్‌లో 6,239 ఎకరాలకుగాను గతంలో పని చేసిన రెవెన్యూ యంత్రాంగం సుమారు 12వేల ఎకరాలకు పైగా పట్టాలు చేసి పాస్ పుస్తకాలు మంజూరు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతుండగా.. మరికొందరు రెవెన్యూ అధికారులపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.