ఏపీలో ఒక్కరోజే 10,276 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. రోజురోజుకూ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగతూనే ఉంది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 10,276 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 97 మంది మరణించారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,189కు చేరింది. 

ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,45,216కు పెరిగింది. రాష్ట్రంలో 89,389 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు  కరోనా నుంచి కోలుకొని 2,52,638కు చేరింది. 24 గంటల్లో 61,469 మందికి కరోనా టెస్టులు చేశారు.