ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్‌కు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్‌ సోకగా తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు దవాఖానలో చేరానని ఆయన తెలిపారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.