మేడ్చల్ జిల్లాలో తహసీల్దార్ల పీఠాలు కదిలాయి. దీర్ఘకాలంగా ఒకే మండలంలో పని చేస్తున్న అధికారులపై, అవినీతి ఆరోపణలున్న అధికారులపై బదిలీ వేటు పడింది. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏక కాలంలో 12 మంది తహసీల్దార్/ తహసీల్దార్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ డా.వాసం వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు అందిన వెంటనే.. పోస్టింగ్ ఇచ్చిన స్థానంలో బాధ్యతలు స్వీకరించాలని కలెక్టర్ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ బదిలీలకు రూ.1.25 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తహసీల్దార్ నాగరాజు ఎఫెక్ట్ ఉండి ఉంటుందని జిల్లా రెవెన్యూ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. తహసీల్దార్ నాగరాజు వ్యవహారం జరిగిన మరుసటి రోజు తహసీల్దార్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్.. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని, అవినీతి ఆరోపణలతో పాటు దీర్ఘకాలికంగా ఓకేచోట పనిచేస్తున్న వారిపై వేటు తప్పదని మౌకిక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తహసీల్దార్లపై నిఘా పెంచిన కలెక్టర్.. సోమవారం 12మందిపై బదిలీ వేటు వేశారు.
జిల్లాలో బదిలీ అయిన 12 మంది తహసీల్దార్ల వివరాలు..
అధికారి పేరు ప్రస్తుతం బదిలీ అయిన స్థానం
వై.గౌరివత్సల కుత్బుల్లాపూర్ కీసర
కె.గౌతంకుమార్ కాప్రా/ఎఫ్ఏసీ ఉప్పల్, కీసర కాప్రా/ఎఫ్ఏసీ ఉప్పల్
ఎం.సరళ ఏవో- కీసర ఆర్డీవో ఆఫీస్ హెచ్-సెక్షన్ సూపరింటెండెంట్
ఎన్.ఆర్.సరిత డీ-సెక్షన్ సూపరింటెండెంట్ మల్కాజిగిరి
బి.గీత మల్కాజిగిరి మేడ్చల్
ఎం.సురేందర్ మేడ్చల్ శామీర్‌పేట/మూడుచింతలపల్లి ఎఫ్ఏసీ
ఎం.మహిపాల్‌రెడ్డి బాలానగర్ కుత్బుల్లాపూర్
గోవర్ధన్ శామీర్‌పేట కూకట్పల్లి/బాలానగర్ (ఎఫ్ఏసీ)
సంజీవరావు కూకట్పల్లి ఏవో- కీసర ఆర్డీవో
వి. భూపాల్ దుండిగల్- గండిమైసమ్మ బాచుపల్లి- ఎఫ్ఏసీ
ఎన్. నిర్మల బాచుపల్లి ఏఓ- మల్కాజిగిరి ఆర్డీవో ఆఫీస్
డి.అహల్య డీ-సెక్షన్ సూపరింటెండెంట్ ల్యాండ్ రీ ఫామ్స్