ఏపీలో కొత్తగా 10,830 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. ప్రతిరోజూ దాదాపు 10వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.  బుధవారం కొత్తగా 10,830 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,82,469కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 2,86,720 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 3,541 మంది మృతి చెందారు.