ఈనెల 28న పీవీ శత జయంతి ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు  శత జయంతి ఉత్సవాల నిర్వహణపై  ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 28వ (శుక్రవారం)  తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమీక్ష  నిర్వహించనున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించడంతో  పాటు, రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే కేశవరావు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉన్నది.