తెలంగాణలో కొత్తగా 2,932 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణరాష్ట్రంలో గురువారం 61,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,932 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,17,415కు చేరిందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన బులెటిన్‌ విడుదల చేశారు. ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 799కి చేరిందన్నారు. కరోనా బారి నుంచి ఒక్క రోజులోనే 1,580 మంది కోలుకున్నారన్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 87,675కి చేరిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 28,941 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందులో 22,097 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల్లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,04,343 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.