దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది కరోనా బారిన పడగా, ఈ రోజు కూడా అంతే సంఖ్యలో పాజటివ్ కేసులు వచ్చాయి. దీంతో ప్రపంచంలో రోజువారీగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
దేశంలో గత 24 గంటల్లో 78,512 కరోనా కేసులు కొత్తగా నమోదవగా, 971 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 36,21,246 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 64,469 మంది బాధితులు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల్లో 7,81,975 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 27,74,802 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
వారం రోజులు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో దేశంలో గడచిన వారం రోజుల్లో 13.1శాతానికి పెరిగాయి.
నిన్న ఒకేరోజు 8,46,278 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. అదేవిధంగా ఆగస్టు 30 వరకు 4,23,07,914 నమూనాలను పరీక్షించామని తెలిపింది.