లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సోమవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డారు. హంటర్‌రోడ్డులోని వాణిజ్య పన్నుల శాఖ వరంగల్ డివిజన్ కార్యాలయంలో జనగామ సర్కిల్ డీసీటీవో జ్యోతి పని చేస్తున్నారు. ఇటీవల వరంగల్ అర్బ న్-3 సీటీవో విరమణ పొందడంతో ఆ బాధ్యతలను జ్యోతికి అప్పగించారు. ఈక్రమంలో కాంట్రాక్ట్ వేసేందుకు తనకు జీఎస్టీ క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలని యాకయ్య అనే వ్యక్తి జ్యోతిని కోరాడు. దీంతో సర్టిఫికెట్ ఇచ్చేందుకు సదరు అధికారి రూ.5వేలు లంచం డిమాం డ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం సంబంధిత అధికారికి రూ. 2వేలు అందజేస్తుండగా జ్యోతితో పాటు సీనియర్ అసిస్టెంట్ రయీ స్ పాషాను పట్టుకున్నారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మిగిలిన సర్కిళ్లకు చెందిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.