ఏపీలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో మరో మంత్రి కరోనా బారినపడ్డారు.  తాజాగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా  పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో  ఆయన చికిత్స పొందుతున్నారు.   రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది  అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా  మహమ్మారి బారినపడ్డారు.   

మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.   ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గత కొన్నిరోజుల నుంచి ప్రతిరోజూ పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.