సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) మాజీ డిప్యూటీ కమిషనర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. రూ. లక్ష లంచం కేసులో మాజీ డిప్యూటీ కమిషనర్‌తో పాటు కస్టమ్స్ హౌజ్ ఏజెంట్, ఓ వ్యాపారవేత్తను(బొమ్మల దిగుమతిదారుడు) సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కస్టమ్స్ అధికారులు నిలుపుదల చేసిన బొమ్మల సరుకును క్లియర్ చేసేందుకు తన పరపతిని వినియోగించడం, ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపించడానికి కుట్రపన్నారన్న ఆరోపణలపై నిందితులపై కేసు నమోదైంది.
చిక్కుకున్న సరుకును క్లియర్ చేయడానికి కస్టమ్స్ విభాగంలో తన ప్రభావాన్ని ఉపయోగించేందుకు రూ. లక్ష తీసుకున్నట్లుగా ఆరోపణలు. డిప్యూటీని కమిషనర్‌ను అరెస్టు చేసిన సీబీఐ నిందితుడి వద్ద నుంచి రూ. లక్ష రికవరి చేసింది. మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు. ఢిల్లీలోని నిందితుల నివాసాల్లో సైతం సీబీఐ సోదాలు చేపట్టి ఇందుకు సంబంధించిన డాక్యుమెట్లను స్వాధీనం చేసుకుంది. నిందితులు ముగ్గురిని మంగళవారం ఢిల్లీలోని కాంపిటెంట్ కోర్టులో హాజరుపరిచారు.