నాచారం పీఎస్ లో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్..

నాచారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. నిషేధిత గుట్కా వ్యాపారి నుంచి  ఎస్ఐ శివ కుమార్, కానిస్టేబుళ్లు రాము, అశోక్ లు రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో విచారణలో లంచం డిమాండ్ చేసినట్లు తేలడంతో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సిపి మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు.