కీసర తాసిల్దార్‌ నాగరాజు లాకర్‌లో కిలోన్నర బంగారం!

భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజు బ్యాంకు లాకర్‌లో కిలోన్నర బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ కస్టడీలో భాగంగా నాగరాజు నుంచి కీలక విషయాలు సేకరించారు. సోదాల్లో దొరికిన బ్యాంకు లాకర్‌ కీ గురించి తెలుసుకున్నారు. నాగరాజు బంధువు జీజే నరేందర్‌ పేరిట అల్వాల్‌ సౌత్‌ ఇండియా బ్యాంక్‌లో సదరు లాకర్‌ ఉన్నట్టు గుర్తించి బుధవారం దాన్ని తెరిపించారు. లాకర్‌లో ఉన్న 1,532 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.57.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.