సీఎం కేసీఆర్‌కు బాలాపూర్ ల‌డ్డూను అంద‌జేసిన గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి

ప‌్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బాలాపూర్ ల‌డ్డూను గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌భ్యులు అంద‌జేశారు. విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మ‌క్షంలో ల‌డ్డూను స‌భ్యులు అంద‌జేశారు. కొవిడ్ దృష్ట్యా ఈ ఏడాది బాలాపూర్ ల‌డ్డూ వేలంను నిర్వాహ‌కులు ర‌ద్దు చేశారు. 

కరోనా నేపథ్యంలో బాలాపూర్‌ గణనాథుడి లడ్డూ వేలంపాటను రద్దు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వినాయక చవితి ఉత్సవాల్లో బాలాపూర్‌ లడ్డు వేలంపాటకు ఎంతో ప్రత్యేకత ఉంది. 1994లో మొదట 450 రూపాయలు పలికిన వేలంపాట 2019లో రూ. 17.60 లక్షలు పలికింది. గత 26 సంవత్సరాలుగా తగ్గిన సందర్భాలు లేవు.