ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగుతుందో ప్రతిరోజూ ఎక్కడో చోట చదువుతూనే ఉంటారు. అయినా ప్లాస్టిక్ వాడకాన్ని మాత్రం మానలేకపోతున్నారు. కనీసం ఎవరైనా వచ్చినప్పడు ఇచ్చే విజిటింగ్ కార్డు కూడా ప్లాస్టిక్‌నే వాడుతుంటే ఇంకెప్పుడు మార్పు వస్తుంది. అందుకే ఈ మార్పు మనదగ్గర నుంచే మొదలవ్వాలంటున్నారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కశ్వాన్. ప్లాస్టిక్ విజిటింగ్ కార్డును పూర్తిగా నిర్మూలిస్తూ అట్టముక్కతో తయారు చేసిన విజిటింగ్ కార్డును వాడుతున్నారు.
ఇది కేవలం పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా పచ్చదనాన్నిస్తుంది. అయితే ఈ విజిటింగ్ కార్డులో పేరు, మెయిల్ ఐడీ తప్ప మరే సమాచారం లేదు. ఎందుకంటే దీన్ని తనకోసం వాడుకోవడం లేదు పర్వీన్. ఈ విజిటింగ్ కార్డు తీసుకున్న ప్రతీఒక్కరూ దీనిని భూమిలో పాతిపెట్టాలని కోరారు. దీంతో తులసి మొక్కలు మొలుస్తాయి అని చెబుతున్నారు. ఈ కార్డును చూస్తేనే అర్థమవుతుంది నాటిన తర్వాత ఎలా ఉండబోతుందో అని. అంత మంచి పనిని ప్రతి ఒక్కరూ పాటిస్తే బాగుంటుంది అంటున్నారు నెటిజన్లు.