ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ల చెరువు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డ ఏసీపీ బాలు జాదవ్ మృతి చెందారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నిజామాబాద్ ఏసీపీ గా బాలు జాదవ్ పనిచేస్తున్నారు. తన స్వగ్రామమైన కూసుమంచి మండలంలోని లోక్యా తండాకు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. బాలు జాదవ్ మృతిపై పలువురు సంతాపం ప్రకటించారు.