ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,776 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,76,506కు చేరింది. ప్రస్తుతం 1,02,067 యాక్టివ్ కేసులున్నాయి.
ఇప్పటి వరకు 3,70,163 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4,276కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 12,334 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు 39,65,694 శాంపిల్స్ పరీక్షించారు.