తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసి జాబితాను విడుదలచేశారు. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జీవో జారీచేశారు. వీరందరికీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరణం వల్ల 7 రోజులు సంతాపదినాలు ముగిసిన తర్వాత అవార్డులు ప్రదానంచేస్తారు. కరోనా నేపథ్యంలో అవార్డులను డీఈవోల ద్వారా ఉపాధ్యాయుల ఇంటి వద్దే అందించనున్నారు.