తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. వైరస్ ప్రభావంతో తాజా 9 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 886కు చేరింది. వైరస్ నుంచి కొత్తగా 2,927 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 1,07,530 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 32,553 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.62శాతం ఉండగా, దేశంలో 1.71శాతం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 76.2శాతంగా ఉందని చెప్పింది. 25,449 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని తెలిపింది. శనివారం ఒకే రోజు 62,736 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. ఇప్పటికీ 17,30,389 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇంకా 3,129 శాంపిల్స్ రావాల్సి ఉందని చెప్పింది. 10లక్షల జనాభాకు 46,608 టెస్టులు చేస్తున్నట్లు వివరించింది. కాగా, తాజాగా నమోదైన 2,574 కేసులో హైదరాబాద్లో 325 నిర్ధారణ అయ్యాయి. తర్వాత రంగారెడ్డిలో 197, మేడ్చల్ మల్కాజ్గిరి 185, నల్గొండ 158, కరీంనగర్ 144, ఖమ్మం 128, వరంగల్ అర్బన్ 117, సూర్యపేట 102 అత్యధికంగా పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి.