కర్ణాటకలో మరో మంత్రి శివరామ్‌ హెబ్బార్‌కు కరోనా పాజిటివ్‌

కర్ణాటకలో మరో మంత్రి శివరామ్‌ హెబ్బార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.  కర్ణాటక కార్మిక శాఖ మంత్రి హెబ్బార్‌ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆకాంక్షించారు. 

‘నేను, నా భార్య కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నాం.  మా ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఎవరికి కూడా కరోనా లక్షణాలు లేవు. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లోనే చికిత్స పొందుతున్నామని’ హెబ్బార్‌ ట్వీట్‌ చేశారు. 

శివరామ్‌ కన్నా ముందు అటవీశాఖ మంత్రి ఆనంద్‌ సింగ్‌, పర్యాటకశాఖ మంత్రి సీటీ రవి, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీరాములు, ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కరోనా బారినపడ్డారు. వీరంతా ఇప్పటికే కోలుకున్నారు.