ఏపీలో కరోనా విలయం సృష్టిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇప్పటి సుమారు 30 మంది వరకు ఎమ్మెల్యేలు వైరస్ పాజిటివ్‌గా పరీక్షించారు. పలువురు మంత్రులు సైతం మహమ్మారి బారినపడ్డారు. పలువురు కోలుకున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు కనబడడంతో కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ తర్వాత నుంచి ఆయన కాకినాడలోని ఓ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా బెంగళూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం.