సూర్యాపేట జిల్లాలో చిప్‌తో పెట్రోల్‌ మోసాలు

చిప్‌ అమర్చడంతో రీడింగ్‌ కరెక్టుగానే చూపిస్తూ 30మిల్లీ లీటర్ల ఆయిల్‌ తక్కువ  వచ్చేలా చిప్‌లకు సాఫ్ట్‌వేర్‌ పొందుపర్చి గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారు. చిప్‌ అమర్చిన బంకుల్లో తెలంగాణలోని 11బంకులను జప్తు చేసినట్లు గురువారం రాత్రి సైబరాబాద్‌ సీపీ సజ్జానార్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, వీటిలో జిల్లాకు చెందిన రెండు పెట్రోల్‌బంకులు ఉండడం గమనార్హం. వీటి వివరాలు ఆదివారం ఆలస్యంగా వెలుగుచూశాయి. వీటిని జప్తు చేసినా జిల్లా అధికారులు తమకు తెలియదనడం విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలోనూ జిల్లాలో పలు బంకులపై వాహనదారులు ఫిర్యాదు చేసినా అధికారుల చర్యలు అంతంత మాత్రమే కావడంతో బంక్‌ నిర్వాహకులు రెచ్చిపోయి మోసాలకు పా ల్పడుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నా రు. అంతేకాకుండా జిల్లాలో ఒక బంక్‌పై ఇదే ఫి ర్యాదు రాగా వారిని రక్షించడానికి జిల్లా తూనికలు, కొలతల అధికారే సహకరించి సస్పెండ్‌ అ యిన విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ విషయం మరువకముందే తాజాగా జిల్లాలోని బంకుల మోసాలు హైదరాబాద్‌ అధికారులు బయటపెట్టినా జిల్లా అధికారు లు ఏమి చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.