ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కోవిడ్‌ కలకలం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్‌లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో ఒకరికి కరోనా వైరస్‌ పాటిజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో ముగ్గురికి కరోనా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన రెసిడెంట్‌ కమిషనర్‌ డాక్టర్. గౌరవ్ ఉప్పల్ తెలంగాణ భవన్‌లో పలు నిషేధాజ్ఞలు విధించారు.